
న్యూఢిల్లీ: భారతదేశంలో తమ పట్టు సడలుతున్నట్టు గ్రహిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐస్) ఆత్మాహుతి దాడులకు పాల్పడటానికి పథకాలు వేస్తున్నట్టు వెల్లడవుతోంది. భారత దేశంలోని కీలక నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపడం కోసం ఇప్పటికే పలువురిని ఎంపిక చేసి రంగంలోకి దింపినట్టు కనిపిస్తోంది.
అటువంటి ఇద్దరు వ్యక్తులు ఆదివారం వేర్వేరు ప్రదేశాలలో పోలీసులకు పట్టుబట్టారు. ఓ వ్యక్తి రష్యాలో ఆ దేశ భద్రతా అధికారులకు పట్టుబడగా, మరో వ్యక్తిని జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖను దాటి దేశంలో చొరబాటుకు ప్రయత్నించిన భద్రతా దళాలకు పట్టుకున్నాయి.
రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ ఎస్ బి) అధికారులు సోమవారం ఒక ఆత్మాహుతి బాంబర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అదుపులోకి తీసుకున్న బాంబర్ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందినవాడు. అతను భారతదేశంలో నాయకులపై ఆత్మాహుతి దాడులకు పాల్పడటం కోసం పథకాలు వేస్తున్నాడు.
“రష్యా ఎఫ్ ఎస్ బి రష్యాలో నిషేధించిన ఇస్లామిక్ స్టేట్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ సభ్యుడిని గుర్తించి, నిర్బంధించింది. అతను మధ్య ఆసియా ప్రాంతంలోని ఒక దేశానికి చెందిన వాడు. అతను భారత దేశంపై చెందిన పాలక వర్గాల ప్రతినిధులలో ఒకరిపై తనను తాను పేల్చేసుకోవడం ద్వారా ఉగ్రవాద చర్యకు పాల్పడాలని ప్లాన్ చేశాడు”. అని ఒక అధికార ప్రకటనలో తెలిపారు.
Source: Nijamtoday





