News

ప్రపంచ ఛాంపియన్​కు మ‌ళ్ళీ షాకిచ్చిన ప్రజ్ఞానంద్

227views

న్యూఢిల్లీ: భారత యువ గ్రాండ్​మాస్టర్​ ప్రజ్ఞానంద్ ప్రజ్ఞానంద మరో ఘనతను సాధించి ఓ సూపర్​ రికార్డ్​ను తన ఖాతాలో వేసుకున్నాడు. అమెరికన్‌ ఫైనల్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌ చెస్‌ టూర్‌లో భాగంగా ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌ టోర్నీలో సోమవారం జరిగిన పోటీల్లో ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించాడు. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో టైబ్రేక్​లో ఈ విజయం సాధించాడు. కేవలం ఆరు నెలల వ్యవధిలో మాగ్నస్​ కార్లెసన్​ను ప్రజ్ఞానంద ఓడించడం ఇది మూడోసారి. ఈ విజయంతో అతడు టోర్నీలో రన్​రప్​గా నిలిచాడు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి