News

‘అగ్నిపథ్’పై వ్య‌తిరేక ఆందోళ‌న‌లు… రైల్వేకు రూ. 259.44 కోట్ల నష్టం

377views

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో భాగంగా ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడంతో భారతీయ రైల్వేలకు రూ.259.44 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో సామూహిక నిరసనలు జరిగాయి. బీహార్ నుంచి తెలంగాణ వరకూ రైల్వే ఆస్తులపై దాడులు, ధ్వంసం చేయడం, నిప్పుపెట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఈస్ట్ సెంట్రల్ రైల్వే బాగా నష్టపోగా, యూపీలోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున నిరసలు వ్యక్తమయ్యాయి. ఈ ఆందోళనల కారణంగా జూన్ 15 నుంచి జూన్ 23 వరకూ 2132 పైగా రైళ్ళు రద్దయ్యాయని మంత్రి తెలిపారు.

రైళ్ళ‌ రద్దు కారణంగా ప్రయాణికులకు సొమ్ము తిరిగి ఇచ్చేందుకు ప్రత్యేక డాటాను నిర్వహించామన్నారు. జూన్ 14 నుంచి 30వ తేదీ వరకూ రూ.102 కోట్ల మొత్తాన్ని మంజూరు చేశామని చెప్పారు. ఆ సమయంలో రద్దయిన రైలు సర్వీసులన్నింటినీ తిరిగి పునరుద్ధరించినట్టు వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి