
428views
-
ఏకనాథ్ షిండేకు మద్దతిచ్చిన 12 మంది ఎంపీలు
ముంబై: రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేకు బిగ్ షాక్ తగిలింది. తన పార్టీ ఎంపీలంతా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు ఓటేసిన కాసేపటికే వారంతా ఆయనకు షాకిచ్చారు. శివసేన పార్టీ ఎంపీల్లో 12 మంది ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌తో టచ్‌లో ఉన్నారని, వారు ఈ రాత్రికే ఢిల్లీకి పయనమౌతున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా ఈ రాత్రికే ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీ సీనియర్ నేతలను కలుసుకుంటారు.





