News

టీటీడీ పాలకవర్గ భేటీలో కీలక నిర్ణయాలు

349views

తిరుప‌తి: టీటీడీ పాలకవర్గ భేటీలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. భేటీ సోమ‌వారం జ‌రిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులు సమక్షంలో నిర్వహించేందుకు నిర్ణ‌యించారు. సెప్టెంబర్ 27వ తేదీ నుండి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అలాగే, దేశవ్యాప్తంగా వైభవోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్ 16 నుంచి 20వ తేదీ వరకు నెల్లూరులో వైభోత్సవాలు నిర్వహించ‌నున్నారు. 7.32 కోట్లతో యస్వీ గోశాలకు పసుగ్రాసం కోనుగోలు చేయాలని, 2.7 కోట్లతో పార్వేటి మంటపం, 154 కోట్ల రూపాయల వ్యయంతో చిన్నపిల్లల ఆసుపత్రికి టెండర్లు ఖరారు చేయనున్నారు. 2.9 కోట్లతో అమరావతిలో ఆలయం వద్ద పచ్చదనం అభివృద్ధి చేయనున్నారు.

మరిన్ని నిర్ణయాలు

*ఆనంద నిలయ గోపురానికి బంగారు తాపడం పనులు
*ఆగమపండితులు సలహా మేరకు నెల రోజులు తరువాత పనులు ప్రారంభిస్తారు
*అక్టోపస్ కోసం కేటాయించిన భవన నిర్మాణం కోసం అదనంగా ఏడు కోట్లు కేటాయింపు
*తిరుమలలోని యస్వీ పాఠశాలలో ఉన్నత ప్రమాణాలతో విద్య
*సింఘానియా గ్రూప్ తో ఒప్పందం
*18 లక్షలతో బేడి ఆంజనేయస్వామికి బంగారు కవచం
*భక్తులకు అందుబాటులోకి ఈ ఏడాది 33 లక్షల క్యాలండర్లు
*ప్రతి నెల 2.1 లక్షల సప్తగిరి మాస పత్రిక ముద్రణ
*యంత్రాల సాయంతో లడ్డు ప్రసాదం బూందీ తయారీపై అధ్యయనం
*ప్రసాదాల తయారీకి వినియోగించే ఆర్గానిక్‌ ముడిసరుకుల కొనుగోలుకు మార్క్ ఫెడ్ తో ఒప్పందం

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి