News

చౌడేశ్వరి దేవాలయంలో చోరీ

392views

ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండలోని చౌడేశ్వరి దేవాలయంలో చోరీ జరిగింది. దొంగ‌ గర్భగుడి తాళాలు పగలగొట్టి, అమ్మవారి 12.5 కిలోల వెండి ఆభరణాలను దొంగిలించాడు. దొంగ దేవాలయం వెనుక భాగంలో ఉన్న కొండపై నుంచి గుడిలోకి ప్రవేశించాడు. తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడటం సీసీటీవీలో రికార్డ్‌ అయ్యింది. ఆలయ అర్చకుడు దొంగతనంపై ధర్మకర్తకు సమాచారం ఇచ్చారు. పోలీసులు క్లూస్‌ టీంతో దొంగ వేలిముద్రలను సేకరించారు. ఏడున్నర లక్షల రూపాయల విలువైన అమ్మవారి కిరీటం, చేతులు, ఇతర వెండి నగలు ఎత్తుకెళ్ళిన‌ట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి