News

కమనీయం జగన్నాథుని స్నానయాత్ర

36views

విశ్వప్రసిద్ధ పూరీ క్షేత్రం లక్షల మంది భక్తుల జయ జయధ్వానాలతో మార్మోగింది. జ్యేష్ఠపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనల (చతుర్థామూర్తులు) స్నానయాత్ర వైభవంగా నిర్వహించారు. 7లక్షల మంది భక్తులు ఈ వేడుకను వీక్షించారు. ఒడిశా సీఎం మోహన్‌చరణ్‌ మాఝి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. 108 కలశాల పవిత్ర జలాలతో దారు విగ్రహాల దేవస్నానం జరిగాక… సాయంత్రం పురుషోత్తముడు గజానన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చాడు.ఆనవాయితీ ప్రకారం చతుర్థామూర్తులను రాత్రి ఒనొసొనొ (చీకటి మందిరం) ఆలయానికి తరలించారు. 108 కలశాల జలంతో స్నానమాచరించిన స్వామి అస్వస్థతకు లోనవుతారని భావించి.. చీకటి మందిరంలో 12 రోజులపాటు గోప్య చికిత్స, ఉపచారాలు చేపడతారు. జులై 16న జగన్నాథుని రథయాత్ర నిర్వహిస్తారు.