
ప్రస్తుతం నడుస్తోంది AI యుగం. AI సాంకేతికత సమాచారం కోసం వినియోగిస్తే బాగుంటుంది. కానీ.. రాయ్ పూర్ లో మాత్రం సాంకేతికతను ఉపయోగించి, హిందూ ధర్మాన్ని అగౌరవపరుస్తున్నారు. సోషల్ మీడియాలో తాజాగా ఇలాంటి కేసే వెలుగులోకి వచ్చింది.ఒక క్రైస్తవ సంస్థ నిర్వహిస్తున్న ‘ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్’ అనే ఫేస్‌బుక్ పేజీ, హిందూ దేవతలను చిత్రీకరిస్తూ అభ్యంతరకరమైన, వివాదాస్పద వీడియోలను అప్‌లోడ్ చేసిందని ఆరోపణలు రావడంతో, హిందూ సంస్థలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి సృష్టించి, ఏసుక్రీస్తు తమ తండ్రి అని శివుడు, విష్ణువు అన్నట్లు సృష్టించారు.అంతేకాకుండా, ఒక వీడియోలో ఏసురాముడు బోధిస్తున్నట్లుగా, మరొక వీడియోలో హనుమంతుడు ఏసుక్రీస్తును అత్యంత శక్తిమంతుడని వర్ణిస్తున్నట్లుగా ఉంది.
హిందూ దేవతల కంటే యేసుక్రీస్తును గొప్పవారిగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉన్న ఇటువంటి అనేక వీడియోలు ఆ ఫేస్‌బుక్ పేజీలో అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై నిరసనలు వెల్లువెత్తడంతో, సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.బజరంగ్ దళ్, రామ్ భక్త్ సేన మరియు సంత్ సమాజ్ సభ్యులు ఈ విషయాన్ని మతపరమైన మనోభావాలపై దాడిగా అభివర్ణించారు, అలాగే దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాయ్‌పూర్‌లోని శ్రీ సురేశ్వర్ మహాదేవ్ పీఠం అధిపతి డాక్టర్ స్వామి రాజేశ్వరానంద్ కూడా ఈ విషయాన్ని తీవ్రమైనదిగా అభివర్ణించారు.మతపరమైన భావనలను రెచ్చగొట్టే లేదా సామాజిక అశాంతిని సృష్టించే ఉద్దేశంతో ఎవరైనా కావాలని అటువంటి వీడియోలను రూపొందించి ప్రచారం చేసి ఉంటే, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.





