
422views
తిరుపతి: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు నెలలుగా ప్రతినెలా రూ.100 కోట్లకు పైగా వస్తోంది. ముందెన్నడూ లేనివిధంగా మే నెలలో అత్యధికంగా రూ.129.93 కోట్ల ఆదాయం సమకూరింది. కొవిడ్ కారణంగా గడచిన రెండేళ్ళలో శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించడంతో ఆ కాలంలో హుండీ ఆదాయం బాగా తగ్గింది.
ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో శ్రీవారి దర్శనానికి భక్తులను పూర్తి స్థాయిలో టీటీడీ అనుమతిస్తోంది. కాగా, ప్రస్తుతం శ్రీవారి హుండీ ఆదాయం గతం కంటే ఎక్కువగా లభిస్తోంది. గతంలో ఏడాదికి రూ.1,200 కోట్ల వరకూ హుండీ ఆదాయం లభించేది. మే, జూన్ నెలల్లో రూ.100 కోట్ల మార్కును దాటేది. మిగిలిన నెలల్లో మాత్రం నెలనెలా వచ్చే హుండీ ఆదాయం రూ.100 కోట్ల లోపే వుండేది. ప్రస్తుతం రోజుకు సుమారు రూ.4 కోట్లు హుండీ ద్వారా వస్తోంది.





