News

బీజేపీని ఓడించే దమ్ము సమాజ్ వాదీ పార్టీకి లేదని తేలింది: అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

403views

భాగ్య‌న‌గ‌రం: ఎంఐఎం పార్టీ అధినేత,  హైదరాబాద్‌ ఎంపీ యూపీ ఉప ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితంతో బీజేపీని ఓడించే దమ్ము సమాజ్‌వాదీ పార్టీకి లేదని స్పష్టం అవుతోందని అన్నారు. యూపీ ఉప ఎన్నికల ఫలితాలు.. సమాజ్‌వాదీ పార్టీకి బీజేపీని ఓడించే దమ్ము లేదని నిరూపించాయి. అసలు ఆ పార్టీకి అంత మేధో నిజాయితీ లేదని తేలింది. ఇలాంటి అసమర్థ పార్టీలకు దయ చేసి మైనారిటీలు ఓట్లు వేయకండి అని ఒవైసీ పిలుపు ఇచ్చారు. ‘‘బీజేపీ గెలుపునకు బాధ్యులెవరో.. ఇప్పుడు ఎవరికి బీజేపీ బి-టీమ్, సి-టీమ్ అని పేరు పెడతారో’’ అంటూ అఖిలేష్‌ యాదవ్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు ఒవైసీ. అంతేకాదు రాంపూర్‌, ఆజాంఘడ్‌ ఉప ఎన్నికల్లో ఓటమికి ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌నే బాధ్యుడిగా విమర్శించారు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి