News

డల్లాస్‌లో ఘనంగా శ్రీనివాసుని కల్యాణం

373views

డ‌ల్లాస్‌: అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీనివాస కల్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున డల్లాస్‌ నగరంలో వైభవంగా స్వామివారి కల్యాణోత్సవం జరిగింది. కల్యాణోత్సవ క్రతువులో భాగంగా పుణ్యాహవాచనం, విష్వక్సేన ఆరాధన, అంకురార్పణ, మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణమాయిరం, హారతి తదితర కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి