
న్యూఢిల్లీ: నూపర్ శర్మ వ్యాఖ‍్యలకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఐసీస్ హెచ్చరించింది. భారత్ అంతటా దాడులు చేస్తామంటూ ఐసీస్ ఖొరాసాన్ హెచ్చరించారు. ఇక గత వారం.. మహమ్మద్ ప్రవక్తను అవమానించినందుకు ప్రతీకారంగా భారత్‌లోని వివిధ నగరాల్లో ఆత్మాహుతి బాంబు దాడులు జరుపుతామంటూ వార్నింగ్ ఇస్తూ అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS) ఒక లేఖను జారీ చేసిన విషయం తెలిసిందే.
అంతకు ముందు కూడా ఉగ్ర సంస్థ ఎంజీహెచ్ నూపుర్ శర్మకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల చేసినందుకుగానూ బేషరతుగా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలని ఒక బెదిరింపు ప్రకటన విడుదల చేసింది. ‘‘నూపుర్ శర్మ తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. మొత్తం ప్రపంచానికి క్షమాపణలు చెప్పాలి. లేకుంటే.. ప్రవక్తను అగౌరవపరిచినందుకు ఏం చేయాలో అది చేస్తాం’’ అంటూ టెలిగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్‌లో క్రియాశీలకంగా వ్యవహరించే ఈ ఉగ్రసంస్థ.. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ ఘాజీపూర్ పూల మార్కెట్‌లో ఐఈడీ పేలుడుకు పాల్పడింది.





