
న్యూఢిల్లీ: ఉక్రెయిన్-రష్యా యుద్ధం, అంతర్జాయ పరిణామాల నేపథ్యంలో మన మార్కెట్లు కొంత మెరుగుగా ఉన్నాయి. శ్రీలంక తరువాత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రెండో ఆసియా దేశం పాకిస్తాన్.
తాజా స్టాక్ మార్కెట్ల పరిస్థితులను పరిశీలిస్తే శ్రీలంక కంటే దాయాది దేశ స్టాక్ మార్కెట్లు దారుణంగా మారాయి. పాక్ స్టాక్ మార్కెట్లు ఏకంగా 6 లక్షల 95వేల కోట్ల రూపాయలను నష్టపోయింది. దాదాపు లక్షా 35 కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి. ఆ దేశ చరిత్రలోనే అత్యంత దారుణ ఆర్థిక పతనం ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి కారణం పాకిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం, సీపెక్ ప్రాజెక్టులే కారణమని విశ్లేషిస్తున్నారు.
రాజకీయ, ఆర్థిక సంక్షోభం.. పొరుగు దేశం పాకిస్తాన్‌ను నిండా ముంచుతున్నాయి. ద్రవ్యోల్బణం రాకెట్ కంటే వేగంగా దూసుకుపోతోంది. అంతే వేగంగా విదేశీ మారక నిధులు పడిపోతున్నాయి. పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్సోభం కన్నా.. రాజకీయ ఘర్షణలే ఆందోళనకరంగా మారాయి. ప్రస్తుత సంక్షోభానికి ఇమ్రాన్ ఖాన్ పీటీఐ ప్రభుత్వమే కారణమని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపిస్తున్నారు. బాగున్న పరిస్థితులను పాకిస్తాన్ ముస్లిం లీగ్ షరీఫ్-పీఎంఎల్‌ఎన్ ప్రభుత్వమే మరింత దారుణంగా మార్చిందని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు.
Source: NationalistHub





