News

వ‌చ్చేనెల 4న మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రారంభించ‌నున్న మోదీ

542views

అనంతపురం: నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో ఆరు ఎయిమ్స్‌లను ఏర్పాటు చేసిన్నట్టు తెలుపుతూ ఏపీలో మంగళగిరి వద్ద ఏర్పాటు ఎయిమ్స్ ను ప్రధాని మోదీ జులై 4న ప్రారంభించనున్నట్టు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే తెలిపారు. ఇక్కడ ఎయిమ్స్‌లో ఒక ఏడాది నుంచి వైద్యసేవలు అందిస్తున్నట్టు ఆమె చెప్పారు.

దేశంలో సూపర్‌ స్పెషాలిటీ- వైద్యం ఏ విధంగా అందుతుందో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్టు ఆమె అనంతపురంలో సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ సందర్శన సందర్భంగా తెలిపారు. ఎపిలో తమ పార్టీ అధికారంలో లేకున్నా కూడా ఎయిమ్స్‌ ఏర్పాటు చేశామని ఆమె గుర్తు చేశారు.
ఏ రకమైన వ్యాధులకైనా ఒకటి నుంచి రెండు సంవత్సరాల తర్వాతే మందులన్నీ భారత్‌కు వచ్చేవని, అలాంటి స్థితి నుంచి ఇతర దేశాలకు సైతం వ్యాక్సిన్‌ ను ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం నేడు ఎదిగిందని కేంద్ర మంత్రి తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి