News

తప్పుదారి పట్టించే ప్రకటనలపై కేంద్రం కీలక నిర్ణయం…కొత్త మార్గదర్శకాలు విడుదల

452views

న్యూఢిల్లీ: భార‌తీయుల‌ను తప్పుదారి పట్టించే ప్రకటనల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. దీని ప్రకారం ఇక సరోగేట్ ప్రకటనలను నిషేధించనున్నారు. అలానే పిల్లలే లక్ష్యంగా చేసే యాడ్‌లపై కూడా షరతులు వర్తింపచేసేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల సెక్రటరీ రోహిత్ కుమార్, అదనపు సెక్రటరీ నిధి ఖారే తెలిపారు. ఈ మార్గదర్శకాలను తప్పక పాటించాలని వాణిజ్య సంస్థలను కేంద్రం ఆదేశించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి