News

హానిక‌ర సోషల్ మీడియా ఖాతాల‌ కట్టడికి కేంద్రం కఠిన నిబంధనలు

442views

న్యూఢిల్లీ: సోషల్​ మీడియాను కట్టడి చేసేందుకు కేంద్రం మరిన్ని కఠిన నిబంధనలను ప్రవేశపెట్టనుంది. సామాజిక మాధ్యమ సంస్థల గ్రీవెన్స్​ అధికారులు తీసుకున్న నిర్ణయాలపై ఫిర్యాదుల పరిష్కారానికి అప్పీలేట్​ కమిటీని నియమించనుంది. దీనికోసం ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ రూల్స్​ 2021ను సవరించనుంది. ఈ అప్పీలేట్​ కమిటీలో ఛైర్​పర్సన్​తో పాటు సభ్యులు ఉంటారు. సోషల్​ మీడియా సంస్థల గ్రీవెన్స్​ అధికారి నిర్ణయంపై 30 రోజుల్లోగా అప్పీలేట్​ కమిటీకి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు అందిన 30రోజుల్లోగా దానికి కమిటీ పరిష్కారం చూపనుంది. కమ్యూనిటీ మార్గదర్శాకాలను ఉల్లఘించినందుకు సెలెబ్రిటీల ఖాతాలను బ్లాక్​ చేసిన నేపథ్యంలో ఈ చర్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ప్రముఖ సోషల్​ మీడియా సంస్థ వాట్సాప్​ ఏప్రిల్​లో నివేదికను విడుదల చేసింది.​ సుమారు 16 లక్షల భారతీయ ఖాతాలను నిబంధనలకు అతిక్రమించినందుకు మూసివేసినట్టు తెలిపింది. మరోవైపు విద్వేషపూరిత ప్రసంగాలు 37.82 శాతం పెరిగాయని సోషల్​ మీడియా సంస్థ ఫేస్​బుక్ పేర్కొంది. ఇన్​స్టాగ్రామ్​లో 86 శాతం పెరిగిందని మాతృసంస్థ మెటా తన నివేదికలో తెలిపింది. భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలింగచకుండా ఉండేలా.. సోషల్​ మీడియా సంస్థలకు కఠిన నిబంధనలను తీసుకువచ్చింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి