
482views
భువనేశ్వర్: భువనేశ్వర్లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం మహాసంప్రోక్షణ జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆహ్వానించారు.
మే 21 వ తేదీ నుంచి ఆలయ మహాసంప్రోక్షణకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రికి తెలిపారు. 26వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ జరుగుతాయని చైర్మన్ వివరించారు. కార్యక్రమానికి హాజరవుతానని సీఎం తెలిపారు.





