News

J-K డీలిమిటేషన్‌పై పాకిస్థాన్‌ ‘ప్రహసన తీర్మానాన్ని’ తిర‌స్క‌రించిన భార‌త్‌

517views

న్యూఢిల్లీ: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ మంగళవారం (మే 17) చేసిన ‘ప్రహసన తీర్మానాన్ని’ భారతదేశం తిరస్కరించింది. భారతదేశ అంతర్గత విషయాలపై ఆ దేశానికి ఎటువంటి అధికారం లేదని పేర్కొంది.

“భారత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ, క‌శ్మీర్‌లో డీలిమిటేషన్ అంశంపై పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఆమోదించిన హాస్య తీర్మానాన్ని మేము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాము. పాకిస్తాన్ చట్టవిరుద్ధమైన, బలవంతపు ఆక్రమణలో ఉన్న భారత భూభాగాలతో సహా భారతదేశంలోని అంతర్గత విషయాలపై మాట్లాడానికి లేదా జోక్యం చేసుకోవడానికి పాకిస్తాన్‌కు ఎటువంటి అధికారాలు లేవు, ”అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు.

జమ్మూ క‌శ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల మొత్తం భూభాగం భారత్‌లో అంతర్భాగంగా ఉందని, ఎప్పటికీ అలాగే ఉంటుందని భారతదేశం మరోసారి పునరుద్ఘాటించింది.

ష‌తమ సొంత‌ ఇంటిని చక్కదిద్దడానికి బదులుగా, పాకిస్తాన్‌లోని నాయకత్వం భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, నిరాధారమైన, రెచ్చగొట్టే భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడటం విచారకరం” అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

భారత వ్యతిరేక సరిహద్దు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ తక్షణమే నిలిపివేయాలని, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మూసివేయాలని, పాక్ ఆక్రమిత జమ్మూ, కాశ్మీర్ & లడఖ్ (PoJKL)లో మానవ హక్కుల ఉల్లంఘనలను ఆపాలని MEA ప్రతినిధి మరోసారి అన్నారు.

PoJKL హోదాలో తదుపరి ఎటువంటి భౌతిక మార్పులను అమలు చేయకుండా చట్టవిరుద్ధమైన, బలవంతపు ఆక్రమణలో ఉన్న భారత భూభాగాలను ఖాళీ చేయాలని కూడా ఆ ప్రకటన పాకిస్తాన్‌ను కోరింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి