
497views
న్యూఢిల్లీ: ఈ దశాబ్దం చివరి నాటికి 6జీ టెలికాం నెట్‌వర్క్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అనుసంధానతే.. 21వ శతాబ్దంలో ఓ దేశ ప్రగతిని నిర్ణయిస్తుందని.. ఈ నేపథ్యంలో ఆధునిక మౌలిక సదుపాయాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మంగళవారం ఆన్‌లైన్ వేదికగా ఢిల్లీలోని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) రజతోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొని, మాట్లాడారు. దేశంలో త్వరలో 5జీ సేవలను ప్రారంభించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెట్‌వర్క్ అమల్లోకి వస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థలో మరో 450 బిలియన్ డాలర్లు వచ్చి చేరతాయని అంచనా వేస్తున్నట్టు ప్రధాని చెప్పారు.
Source: EtvBharat
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





