
చెన్నై: తమిళనాడులో మానసిక వికలాంగురాలైన బాలికపై పాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు పాస్టర్‌పై కేసు నమోదు చేశారు. బాలిక తన తల్లిని వెతుక్కుంటూ చర్చికి వెళ్ళిన సమయంలో పాస్టర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక మైనర్ కావడంతో అతడిపై పోక్సో కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.
49 ఏళ్ళ జోసెఫ్ రాజా రాజపాళ్యంలోని మాల్యాడిపట్టిలోని ఒక చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. 14 ఏళ్ళ మానసిక వికలాంగ బాలిక తన తల్లితో కలిసి చర్చికి నిత్యం వెళ్తుంటుంది. ఆ రోజు ఆ అమ్మాయి తన తల్లిని వెతుక్కుంటూ చర్చికి వెళ్లింది.
చర్చిలోని అమాయక చిన్నారిపై పాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక శరీరంపై ఏర్పడ్డ గాయాలను గమనించిన తల్లి రాజపాళ్యంలోని ఆల్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగుచూసింది. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జైలులో ఉంచారు.
Source: HINDU POST
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





