
-
ఎదిరిస్తే రేప్ చేసి, హత్య చేస్తానని హెచ్చరిక
-
ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయని పోలీసులు
-
సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫిర్యాదు, ఎఫ్.ఐ.ఆర్ నమోదు
బులంద్‌షహర్(ఉత్తరప్రదేశ్): నిజానికి ఇదొక నీతిమాలిన పని… వావివరుసలు మరిచిన పశుతత్వం… సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటన! తాను కన్న తొమ్మిది మంది కూతుళ్ళను తనతో పడక పంచుకోమన్నాడు సాక్షాత్తూ ఓ కన్నతండ్రి. శరీరంలోని అవయవాలను తాకుతూ.. ఎదిరిస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ వేధింపులు జరుగుతున్నా భరించిన ఆ ఆడ బిడ్డలు.. ఇక తట్టుకోలేక రక్షణ కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడంతో ఏకంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కే ఫిర్యాదు చేశారు. ఈ తతంగాన్ని ఓ బాధితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ కామపిశాచి బండారం బట్టబయిలైంది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన జకీర్ అలీకి 45 ఏళ్ళు. తొమ్మిది మంది కుమార్తెల్లో ధైర్యం చేసిన ముగ్గురు జకీర్‌పై కేసు పెట్టేందుకు పోలీసు స్టేషన్‌కు వెళ్ళారు. అయితే, పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం లేదని, జాకీర్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడని ఓ కుమార్తె సోషల్ మీడియా పోస్ట్‌లో ఆరోపించారు.
తండ్రి జాకీర్ చాలా కాలంగా తమను వేధిస్తున్నాడని, ప్రైవేట్ పార్ట్‌లను కూడా తాకుతున్నాడని పెద్ద కూతురు ఆరోపించింది. తనతో పడుకోమని బలవంతం చేశాడని కూడా ఆమె ఆరోపించింది.
పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో కుమార్తెలలో ఒకరు తమకు సహాయం చేసి, తమ తండ్రి నుండి రక్షించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అభ్యర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
అనంతరం బులంద్‌షహర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియా పోస్ట్‌లో, బులంద్‌షహర్ పోలీసులు, “తండ్రిపై బాలికల ఫిర్యాదు ఆధారంగా, సయానా పోలీస్ స్టేషన్‌లో ఈ విషయంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. కేసు విచారణ ప్రారంభమైంది. ” అని ప్రకటించారు.
తాను, తన ఇతర సోదరీమణులు వేధింపులను ప్రతిఘటించగా, జాకీర్ తమపై అత్యాచారం చేసి, హత్య చేస్తానని బెదిరించాడని పెద్ద కుమార్తె ఆరోపించింది. తమ ప్రాణాలకు ముప్పు ఉందని గమనించి, తండ్రిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.
Source: Organiser





