News

ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవక్ హత్య కేసు.. కస్టడీలో 4 పీఎఫ్‌ఐ ఉగ్రవాదులు

456views
  • బిలాల్, రిజ్వాన్, సత్తార్, రియాజ్ ఖాన్‌లుగా పోలీసుల గుర్తింపు

పాలక్కాడ్(కేరళ): ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవక్‌ని ఈ నెల 16వ తేదీన నరికి చంపిన కొన్ని రోజుల తర్వాత, నలుగురు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) ఉగ్రవాదులను గురువారం (ఏప్రిల్ 21) పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ కుట్రలో వీరే ఉన్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

“ఈ నలుగురు, మరో ఆరుగురితో కలిసి ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవక్ హత్యకు పాల్పడ్డారు. నిందితులు కాపలాగా ఉన్నారని, హత్య జరిగిన ప్రదేశానికి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచడం ద్వారా స్పాట్‌ను కవర్ చేస్తున్నారు.. ” అని పోలీసు వర్గాలు తెలిపాయి.

అరెస్టయిన వారిని బిలాల్, రిజ్వాన్, సత్తార్, రియాజ్ ఖాన్‌లుగా గుర్తించారు. ఈ కేసులో మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి