
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్, బీర్భూమ్‌లోని బొగ్తుయ్ గ్రామంలోని ఇళ్ళకు నిప్పంటించడానికి ఉపయోగించిన పెట్రోల్‌ను రవాణా చేసిన ఇ-రిక్షా డ్రైవర్‌ను సీబీఐ గురువారం అరెస్టు చేసింది. ఈ దారుణ ఘటనలో తొమ్మిది మంది సజీవదహనం అయిన సంగతి తెలిసిందే! రిటాన్ షీక్‌ను బొగ్టుయ్‌లోని అతని ఇంటి నుండి తెల్లవారుజామున అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు.
“సీసీటీవీ ఫుటేజీ ద్వారా పెట్రోల్ రవాణా చేసిన వ్యక్తిని గుర్తించారు. అరెస్టు చేసిన ఇతర అనుమానితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలలో కూడా అతడి పేరునే చెప్పారు” అని సిబిఐ అధికారి పిటిఐకి తెలిపారు. హత్యాకాండ తర్వాత రిటాన్ కనిపించకుండా పోయారని పోలీసులు చెప్పారు. “అతను పగటిపూట కనిపించకుండా వెళ్ళేలేవాడు, రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వచ్చేవాడు” అని అధికారి తెలిపారు.
అతడి కోసం సీబీఐ వెతుకుతూ ఉంది. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు పశ్చిమ బెంగాల్ పోలీసుల నుంచి విచారణ చేపట్టిన సీబీఐ ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసింది. గతంలో పోలీసులు అరెస్టు చేసిన 22 మందిని కూడా ఏజెన్సీ కస్టడీలోకి తీసుకుంది. రిటాన్‌ను అరెస్టు చేసిన తర్వాత అతని ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు బదు షేక్ హత్య తర్వాత బొగ్టుయ్‌లోని పలువురు ఇళ్ళపై బాంబు దాడి జరగడంతో తొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు.
Source: NationalistHub





