News

జామియా మసీదులో భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు!

533views

శ్రీ‌న‌గ‌ర్‌: అతిపెద్ద మసీదులలో ఒకటైన శ్రీ నగర్‌లోని జామియా మసీదులో శుక్రవారం ఆజాదీ, భారతదేశ వ్యతిరేక నినాదాలతో మారుమోగింది. శుక్రవారం ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో గుమిగూడిన జనం ఆజాదీ నినాదాలు చేశారు.

మే 2019లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం చేతిలో హతమైన ఉగ్రవాద సంస్థ అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ చీఫ్ జకీర్ మూసాను అభినందించారు. ఇండియా టుడే గ్రూప్‌కు చెందిన జర్నలిస్ట్ అష్రఫ్ వానీ, జామియా మసీదు నుండి ఒక వీడియో క్లిప్‌ను పంచుకున్నారు. దీనిలో భారతదేశం నుండి విడిపోవాలంటూ చేస్తున్న నినాదాలు మనం వినవచ్చు.

వీడియో క్లిప్‌లో ఆజాదీ నినాదాలతో పాటు.. “నారా ఇ తక్బీర్, అల్లాహు అక్బర్” అనే నినాదాలు కూడా వినిపిస్తున్నాయి. ఆజాదీ నినాదాలతో పాటు.. లోయలో శాంతి, ప్రశాంతతకు భంగం కలగకుండా ఉండేలా భద్రతా చర్యల్లో భాగంగా ఉన్న జమ్మూ కశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బందిపై మసీదు వెలుపల రాళ్ళ‌ దాడి కూడా జరిగింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి