
690views
చాందీపుర్: భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) తయారుచేసిన సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్(ఎస్.ఎఫ్.డి.ఆర్) బూస్టర్ క్షిపణి సాంకేతిక పరీక్ష విజయవంతమైంది. ఒడిశా చాందీపుర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ సెంటర్ నుంచి పరీక్షించినట్టు డీఆర్డీవో వెల్లడించింది. క్షిపణి వ్యవస్థలోని అన్ని పరికరాలు నిర్విఘ్నంగా పనిచేసినట్టు చెప్పింది. టెలిమెట్రీ, రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థ ఇచ్చిన డేటా ఆధారంగా పరీక్ష విజయవంతమైనట్టు తేల్చారు.





