News

పది నిమిషాల్లో ఊరిని పేల్చేస్తా…

566views
  • టీఎంసీ నేత షకీర్ అహ్మద్ బెదిరింపులు

ఉత్తర దినాజ్‌పూర్(ప‌శ్చిమ బెంగాల్‌): తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకుడు 10 నిమిషాల్లో మొత్తం గ్రామాన్ని పేల్చివేస్తానని బెదిరిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ నేత షకీర్ అహ్మద్‌గా గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని ఇస్లాంపూర్ సబ్ డివిజన్‌లోని హప్తియా గచ్ గ్రామ పంచాయ‌తీకి ఉప ప్రధాన్ గా పనిచేస్తున్నాడు.

“మా వద్ద చాలా పెద్ద బాంబులు, తుపాకులు ఉన్నాయి, కేవలం 10 నిమిషాల్లో ఆ ప్రాంతాన్ని పేల్చివేయగలం. బాంబులు, తుపాకులు దొరకడం గురించి చింతించకండి” అని అహ్మద్ ఒక సమూహంతో అన్నారు. అక్కడే అతని మద్దతుదారులు కూడా ఉన్నారు. అతని వివాదాస్పద వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దీన్ని కవర్ చేసుకునే పనిలో పడింది.

తృణమూల్ కాంగ్రెస్ కోర్ కమిటీ చైర్మన్ తాహిర్ అహ్మద్ మాట్లాడుతూ “షకీర్ వద్ద తుపాకులు, బాంబుల పెద్ద ఎత్తున ఉన్నాయి. అతనే కాదు.. ఇతర దుండగులు కూడా మారణాయుధాలను కలిగి ఉన్నారు. ఇన్‌స్పెక్టర్-ఇన్-చార్జ్ (ఐసీ), సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)లకు ఈ విషయం గురించి తెలియజేసారు.” అని చెప్పుకొచ్చారు.

ఈ విషయం పార్టీకి సంబంధించినది కాదని తృణమూల్ కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్ (చోప్రా) ప్రీతిరంజన్ ఘోష్ న్యూస్ 18 బంగ్లాతో అన్నారు. “ఎవరు ఆయుధాలు కలిగి ఉన్నారో పరిశోధించడం అధికారుల పని. అతడు ఈ వ్యాఖ్యలను ఊరికే చెప్పి ఉండొచ్చు. ఈ ఘటనపై పార్టీ అంతర్గత సమావేశం నిర్వహిస్తున్నాం.” అని అన్నారు.

  • బీర్భూమ్ హింస పునరావృతమవుతుందని బీజేపీ హెచ్చరికలు

వైరల్ వీడియోపై జిల్లా బీజేపీ నాయకుడు సురోజిత్ సేన్ స్పందిస్తూ, “ఇస్లాంపూర్ సబ్ డివిజన్‌లో భారీ పేలుడు పదార్థాల నిల్వ ఉంది. పోలీసులు ఎందుకు విచారణ చేయడం లేదో అర్థం కావడం లేదు. పార్టీ వర్గాల్లో అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి. ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో బీర్భూమ్ లాంటి హింస పునరావృతం అవ్వొచ్చు” అని అన్నారు.

రాష్ట్ర బీజేపీ నాయకుడు రాహుల్ సిన్హా మాట్లాడుతూ, “పశ్చిమ బెంగాల్‌లో గన్‌పౌడర్ ఎంతగానో అందుబాటులో ఉంది, దాని తయారీదారు తృణమూల్ కాంగ్రెస్. టీఎంసీ ప్రాయోజిత గూండాలు 10 నిమిషాల్లో ఒక గ్రామాన్ని పేల్చివేస్తామని బెదిరిస్తే, వారు మొత్తం రాష్ట్రాన్ని పేల్చివేయడానికి ఎంత సమయం తీసుకుంటారు?” అని ప్రశ్నించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి