News

వారణాశిని సందర్శించనున్న నేపాల్ ప్రధాని

416views
  • దౌత్య విషయాలపై మోదీతో చర్చలు

న్యూఢిల్లీ: నేపాల్‌ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఏప్రిల్ మొదటి వారంలో భారత్‌లో పర్యటించనున్నారు. 2021 జూలైలో నేపాల్‌ ప్రధాని పదవిని మరోసారి చేపట్టిన తర్వాత షేర్ బహదూర్ దేవుబా భారత పర్యటనకు రానుండటం ఇదే తొలిసారి. షేర్ బహదూర్ దేవుబా… ఏప్రిల్ ఒక‌టోతేదీ నుంచి నాలుగోతేదీ వరకు భారత్‌లో పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా ఆయన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిని సందర్శిస్తారు. ఏప్రిల్ రెండోతేదీన‌ ప్రధాని మోదీతో షేర్ బహదూర్ దేవుబా సమావేశమవుతారని సమాచారంం. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, అభివృద్ధి, ఆర్థిక భాగస్వామ్యం, వ్యాపారం, ఆరోగ్య రంగంలో సహకారం, ఇరు దేశ ప్రజల అనుసంధానం, నేపాల్‌-భారత్‌ మధ్య నెలకొన్న సమస్యలపై ఈ సందర్భంగా భారత ప్రధాని మోడీతో షేర్ బహదూర్ దేవుబా చర్చించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి