News

ప్రధాని జీవితంలో స్ఫూర్తివంతమైన ఘట్టాలతో మోడీ స్టోరీస్

472views
  • వెబ్‌సైట్లో ఉంచనున్న నిర్వాహకులు

  • మోడీ సన్నిహితుల నుంచి వివరాల సేకరణ

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితాన్ని సన్నిహితంగా చూసినవారు చెప్పే స్ఫూర్తిదాయక అంశాలతో ఓ వెబ్‌సైట్ ప్రారంభమైంది. మోదీతో సన్నిహితంగా మెలగినవారి జ్ఞాపకాలు, వారు చెప్పే కథనాలు దీనిలో ఉంటాయి. ‘Modi Story’ పేరుతో కొందరు నెటిజన్లు స్వచ్ఛందంగా దీనిని నిర్వహిస్తున్నారు.

‘Modi Story’లో ప్రచురించేందుకు మోదీని కలిసినవారు తమ జ్ఞాపకాలను తమతో పంచుకోవచ్చునని వీరు కోరారు. వ్యాసాలు, ఆడియో లేదా విజువల్ స్టోరీస్, చిన్న కథలు, మోదీతో ఫొటోలు, ఆయన రాసిన లేఖలు లేదా వ్యక్తిగత జ్ఞాపకాలు వంటివాటిని పంపించవచ్చునని తెలిపారు.

modistory.in వెబ్‌సైట్‌ను కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. మోదీతో వ్యక్తిగత సమావేశాలు, సంభాషణలు, జ్ఞాపకాలు, నిశ్చయాత్మక రాజకీయ వ్యక్తిత్వాన్ని, స్నేహపూర్వక వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే అంశాలు వంటివాటిని ఈ వెబ్‌సైట్‌లో చూడవచ్చునని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు.

ఇప్పటి వరకు వెలుగులోకి రాని అంశాలు కూడా దీనిలో ఉంటాయన్నారు. అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన ట్వీట్‌లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితం గురించి ఆసక్తికర విషయాలు ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి