
419views
* కేంద్రం నిర్ణయం రాజ్యాంగానికి అనుకూలంగానే ఉంది. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోలేం – సుప్రీంకోర్టు
సాయుధ దళాలకు అందించే ‘ఒకే ర్యాంకు- ఒకే పింఛన్’ విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఓఆర్ఓపీ (ONE RANK – ONE PENSION) అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని పేర్కొంది. ఓఆర్ఓపీకి సంబంధించి ఐదేళ్లకోసారి పెన్షన్ సవరించే తేదీని 2019 జులై 1 నుంచి పరిగణించాలని ఆదేశించింది. బకాయిలు ఉంటే మూడు నెలల్లోగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఐదేళ్లకోసారి కాకుండా వార్షికంగా పెన్షన్ ను సవరించాలని మాజీ సైనికుల అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భగత్ సింగ్ కోశ్యారీ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరింది. అయితే, తాజా తీర్పులో సుప్రీం వీటిని తోసిపుచ్చింది.





