
న్యూఢిల్లీ: భారతదేశంపై నిత్యం విషం చిమ్మే పాకిస్తాన్‌పై.. ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రపంచంలోని ఏ దేశపైనా భారత్‌కు పగ లేదని మరోసారి నిరూపితమైంది. రష్యా సైనిక చర్యల కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ఒక భారతీయ విద్యార్థి, కీవ్‌లోని ఒక పాకిస్తానీ విద్యార్థినికి రొమేనియన్ సరిహద్దుకు చేరుకోవడంలో సహాయం చేశాడు. అక్కడ నుంచి ఆమె తన మాతృభూమికి వెళ్ళింది. ఉక్రెయిన్ నుండి ఇటీవలే తిరిగి వచ్చిన అంకిత్ యాదవ్, పాకిస్తాన్ కాన్సులేట్‌కు చేరుకోవడంలో తనకు సహాయం చేశాడని ఆ యువతి తెలిపింది. అక్కడి నుండి ఆమెను స్వగ్రామానికి తరలించారు.
నేనొక్కడినే భారతీయుడిని…
“ఫిబ్రవరి 24 సాయంత్రం నేను ఆమెను ఒక బంకర్‌లో కలిశాను. ఉక్రేనియన్లతో నిండిన ఆ బంకర్‌లో నేనొక్కడినే భారతీయుడిని. ఆమె మాత్రమే పాకిస్థానీ. భాషా అవరోధం కారణంగా, మేము ఎవరితోనూ మాట్లాడలేకపోయాము. ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలు పెరుగుతూ ఉండడంతో మేము నగరం నుండి పారిపోవడానికి ఒక ప్రణాళికను రూపొందించి, ఫిబ్రవరి 26న బయలుదేరాలని అనుకున్నాము. కానీ కర్ఫ్యూ ఉంది. దీంతో మా మొదటి ప్రయత్నంలో మేము విఫలమయ్యాము, ” అని యాదవ్ చెప్పారు.
కీవ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న యాదవ్, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత తన అనుభవాలను వివరించాడు. నిరంతర బాంబు దాడులు, రష్యా సైనిక చర్యల కారణంగా బంకర్ నుండి బయటకు రావడానికి వారిని అనుమతించలేదని చెప్పాడు. ఆ సమయాల్లో ఆహారాన్ని సేకరించడం సమస్యగా అనిపించిందని యాదవ్ పేర్కొన్నారు.
ఆహారం లేక…
“నాసల్ స్ప్రే తీసుకోవడానికి ఫిబ్రవరి 27న బంకర్ నుండి బయటకు వెళ్ళడానికి నన్ను అనుమతించారు. అప్పుడే నేను నా హాస్టల్‌కు పారిపోయాను. మా ఇద్దరికీ ఆహారం పట్టకుని తో తిరిగి వచ్చాను” అని యాదవ్ చెప్పారు. “తగినంత ఆహారం లేకపోవడంతో, ఫిబ్రవరి 27 రాత్రి ఉక్రేనియన్లు మాకు అందించిన అన్నం మాత్రమే తిన్నాము. నిద్రపోయాము,” అన్నారాయన.
బంకర్ నుండి పారిపోయాము
“ఫిబ్రవరి 28న కర్ఫ్యూ ఎత్తివేయబడినప్పుడు, మేము బంకర్ నుండి పారిపోయాము.. తమ సామగ్రిని తెచ్చుకోడానికి ఒక దుకాణానికి వెళ్ళాం. ఆపై నగరం విడిచి వెళ్ళడానికి ప్లాన్ చేయడం ప్రారంభించాము” అని యాదవ్ చెప్పారు. “ఆ సమయంలో ఆమెకు పాకిస్తాన్ రాయబార కార్యాలయం నుండి కాల్ వచ్చింది. ఆమె ఇప్పటికీ తాను కీవ్‌లో ఉన్నానని, పాకిస్తాన్‌కు చెందిన వారెవరూ ఆమెతో లేరని వారికి చెప్పినప్పుడు, ఎంబసీ అధికారులు నన్ను సరిహద్దుకు ఆమెను తీసుకుని వెళ్ళమని అభ్యర్థించారు” అని యాదవ్ తెలిపారు.
5 కి.మీ. ప్రయాణించిన తర్వాత…
రైల్వే స్టేషన్‌కు సుమారు 5 కి.మీ దూరం ప్రయాణించిన తర్వాత, తాము మరికొంత మంది విద్యార్థులను కలిశామని అయితే రద్దీగా ఉండే రైలులో ఎక్కలేకపోయామని తెలిపారు. అలా మొదటి మూడు రైళ్లను కోల్పోయామని యాదవ్ చెప్పారు. “అదృష్టవశాత్తూ, మాకు ఇంకో రైలు వచ్చింది. కానీ ఖాళీ సీట్లు లేవు. మేము నేలపై కూర్చోవలసి వచ్చింది. కొంత సమయం తర్వాత మా రైలులో పేలుడు వినిపించింది కూడా. చివరికి రైలు నెమ్మదిగా కదలడం ప్రారంభించి మమ్మల్ని మా గమ్యస్థానానికి తీసుకువెళ్లింది,” యాదవ్ అన్నారు.
పాకిస్తానీ అమ్మాయి రాయబార కార్యాలయాన్ని సంప్రదించడంతో వారు టాక్సీని ఏర్పాటు చేశారు. ఇతర పాకిస్తానీ జాతీయులను రొమేనియా సరిహద్దుకు తరలించడానికి బస్సును ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆ యువతి తన సొంత గ్రామానికి చేరుకుందని యాదవ్ వివరించాడు.
Source: Nijamtoday





