News

‘పంజాబ్ పాలిటిక్స్ టీవీ’పై కేంద్రం కఠిన చర్యలు!

375views

న్యూఢిల్లీ: విదేశాల నుంచి పనిచేస్తున్న ‘పంజాబ్ పాలిటిక్స్ టీవీ’పై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. ఈ సంస్థకు చెందిన యాప్​లు, వెబ్​సైట్, సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆదేశాలు జారీ చేసింది. వేర్పాటువాద సంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్’తో ఈ సంస్థకు దగ్గరి సంబంధాలు ఉన్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది.

పంజాబ్ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఈ ఛానెల్ తప్పుడు వార్తలు ప్రసారం చేసిందని నిఘా వర్గాలు తెలిపాయని కేంద్రం తెలిపింది. ఆన్​లైన్ మీడియాను ఉపయోగించుకొని శాంతి, భద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నించిందని వెల్లడించింది. ఐటీ రూల్స్​లో ఉన్న అత్యవసర అధికారాలను ఉపయోగించి పంజాబ్ పాలిటిక్స్ టీవీపై నిషేధం విధించిందని వివరించింది. కాగా, ఫిబ్రవరి 20న పంజాబ్ ఎన్నికలు జరిగాయి. ఒకే విడతలో రాష్ట్రంలోని 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి