
-
టీటీడీపై గోవిందానంద సరస్వతి స్వామి మండిపాటు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) దైవద్రోహం చేస్తోందని.. హనుమంతుని జన్మస్థలం పేరుతో నకిలీ పుస్తకాన్ని ముద్రించిందని గోవిందానంద సరస్వతి ఆరోపించారు. టీటీడీ పాలకమండలి నాటకం ఆడుతోందని… సన్యాసులను, ప్రజలను టీటీడీ మోసం చేస్తోందన్నారు. అంజనాద్రి పేరుతో నిర్మాణాలు చేయడం ద్వారా దుకాణాలు ఏర్పాటు చేసి డబ్బులు సంపాదించేందుకు టీటీడీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. 1200 కోట్ల రూపాయలతో కిష్కింధను అభివృద్ధి చేయనున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. కిష్కింధ హనుమంతుని జన్మస్థలమని ప్రజలకు తెలియజేసేందుకు హనుమత్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో 12 ఏళ్ళపాటు దేశవ్యాప్తంగా రథయాత్ర చేపడుతున్నట్టు ఆయన తెలిపారు.
తిరుపతిలో అడ్డుకున్న పోలీసులు
తిరుపతిలో హనుమత్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతిని పోలీసులు అడ్డుకున్నారు. అలిపిరి గరుడ కూడలి వద్ద గోవిందానంద యాత్రను అడ్డుకున్నారు. అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థలంగా ప్రకటించడాన్ని గోవిందానంద సరస్వతి వ్యతిరేకించారు.
హనుమంతుడు తిరుమలలోని అంజనాద్రిలో పుట్టలేదని… కర్ణాటక రాష్ట్రం కిష్కింధలోని పంపానది క్షేత్రంలోనే జన్మించారని గోవిందానంద సరస్వతి స్పష్టం చేశారు. హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న రథయాత్ర వాహనాన్ని ఆయన తిరుపతిలో ప్రారంభించారు.
Source: EtvBharat





