News

కేరళ ఆయుర్వేద వైద్యంతో కెన్యా మాజీ ప్రధాని కూమార్తెకు కంటిచూపు

585views
  • కెన్యాలోనూ ఈ తరహా వైద్యశాల ఏర్పాటు చేయాలని మోడీకి అభ్యర్థన

తిరువ‌నంత‌పురం: కేరళలోని ఓ ఆయుర్వేద ఆసుపత్రి వైద్యంతో కెన్యా మాజీ ప్రధాని రైలా మోలో డింగా కుమార్తెకు తిరిగి కంటి చూపు వచ్చింది. దీనిపై స్పందించిన ఆయన కెన్యాలో కూడా ఆ ఆసుపత్రి శాఖను ఏర్పాటు చేసేలా ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించినట్టు తెలిపారు.

ఇందుకు మోదీ సానుకూలంగా స్పందించారని అన్నారు. తన కుమార్తె కేరళలోని శ్రీధరీయం ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ అండ్​ రీసెర్చ్ సెంటర్‌లో కంటికి సంబంధించిన చికిత్స తీసుకున్నట్టు తెలిపారు. కేవలం కొద్ది రోజుల్లోనే ఆమెకు కంటి చూపు తిరిగి వచ్చిందని పేర్కొన్నారు. ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం భారత్‌లో వ్యక్తిగతంగా పర్యటిస్తున్న డింగాతో మోదీ భేటీ అయ్యారని, సుమారు మూడున్నర సంవత్సరాల తర్వాత ఆయనతో భేటీ అవడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారని పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌-కెన్యాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సంబంధాలను ఈ సందర్భంగా ఇరువురు నేతలు చర్చించుకున్నట్టు వెల్లడించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి