News

రోడ్డు ప్ర‌మాదంలో జ‌వాన్‌ల‌కు గాయాలు

527views

రాజస్థాన్‌: రాజస్థాన్​లోని సవాయ్​ మధోపూర్ జిల్లాలో ఆర్​పీఎఫ్​ సిబ్బందితో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది జవాన్లు గాయపడ్డారు. జిల్లాలోని చౌత్​ కా బర్వరా ప్రాంతంలోని ఎచర్​ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. జైపుర్​ నుంచి బయలుదేరిన ఈ బస్సు టోంక్ మీదుగా సురేలి చేరుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు. అయితే, ఎచర్​ గ్రామ సమీపంలో ట్రాక్టర్ ట్రాలీని తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి