News

అఖ్లాక్‌… గోవులను చంపుతూ 17 ఏళ్ళుగా తప్పించుకున్నాడు..!

933views

సహరాన్‌పూర్: గోహత్య కేసులో గత 15 ఏళ్లుగా హర్యానా నుంచి పరారీలో ఉన్న నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని అఖ్లాక్‌గా గుర్తించారు. ఈ ఘటనపై సహరాన్‌పూర్ పోలీసులు హర్యానా పోలీసులకు సమాచారం అందించారు. సహరాన్‌పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అఖ్లాక్ ఎన్నో ఏళ్లుగా గోహత్యలకు పాల్పడుతూ ఉన్నాడని.. ఎంతో క్రూరమైన వ్యక్తి మాత్రమే కాకుండా నేరాలకు పాల్పడుతూనే ఉన్నాడని తెలిపారు.

ఇన్‌ఫార్మర్‌ నుంచి అందిన సమాచారం మేరకు అతడిని అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో అఖ్లాక్ వద్ద నుండి ఒక 12 బోర్ గన్, 2 లైవ్ కాట్రిడ్జ్‌లు కూడా స్వాధీనం చేసుకున్నారు. నాగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షహబాద్ మార్కండ గ్రామంలో అరెస్టు చేశారు. అతడు వందల సంఖ్యలో గోవులను విధించినట్టు స్థానికులు తెలిపారు.

యూపీ లోని నన్హేడ బుద్దఖేడా పోలీస్ స్టేషన్‌ పరిధిలోని సహరన్‌పూర్‌లోని నాగల్‌లో నిందితుడు నివాసం ఉండేవాడు. అఖ్లాక్‌ను హర్యానా కురుక్షేత్ర కోర్టు పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించింది. అఖ్లాక్‌ను స్థానికులు ఇఖ్లాక్ అని కూడా పిలుస్తారు. అతని తండ్రి పేరు నిసార్. 2005లో హర్యానాలోని కురుక్షేత్రలో అఖ్లాక్‌పై గోహత్య కేసు నమోదైంది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి