News

వారం రోజుల్లో మూడు ఆలయాలపై దాడులు

496views
  • డీఎంకె పానలో పెరిగిన విధ్వంసాలు

చెన్నై: తమిళనాడులో గత వారం రోజుల్లో మూడు హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ఆలయాల్లోని విగ్రహాలు ధ్వంసమయ్యాయి. పెరంబలూర్‌లోని అమ్మన్‌ ఆలయం, రాణిపేటలోని దుర్గాదేవి ఆలయం, కోయంబత్తూరులోని శ్రీ కృష్ణుడి మూర్తిని ధ్వంసం చేశారు. అయితే, ఈ నేరాల్లో ఒకే ఒక్క నిందితుడిని మాత్రమే పోలీసులు పట్టుకున్నారు. ఎప్పటిలాగే.. నిందితుడు మానసిక రోగిని అని పోలీసులు తేల్చేశారు.

పెరంబలూరు జిల్లాలో ఈ మధ్య కాలంలో హిందూ దేవతా మూర్తులు పదే పదే ధ్వంసానికి గురైన సందర్భాలు చాలానే ఉన్నాయి. అక్టోబర్‌, నవంబర్‌లో ప్రభుత్వ నియంత్రణలో ఉన్న వివిధ దేవాలయాలను దుండగులు ధ్వంసం చేశారు. అందులో ఒకటి ఇటీవల భక్తుల నుంచి సేకరించిన నిధులతో పునరుద్ధరించినది. అదే విధంగా డిసెంబర్‌ 28న మెలనత్తూరు గ్రామంలోని పెరియనాయకి అమ్మన్‌ ఆలయంలోని ఎనిమిది మూర్తులను ధ్వంసం చేశారు. పోలీసులు అనుమానాస్పదంగా పెరియసామి అనే 50 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి… త్రిశూలం పట్టుకుని వీధుల్లో తిరుగుతున్నాడని చెప్పారు. అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించి మూర్తిలను ధ్వంసం చేస్తున్నాడని, చెబుతూ పోలీసులు అరెస్టు చేశారు. అతను కూడా మానసిక రోగి అని పోలీసులు చెబుతున్నారు.

జనవరి 2న రాణిపేటలోని దుర్గాదేవి ఆలయంలోని త్రిశూలం ధ్వంసం కాగా.. కొత్త సంవత్సరం తర్వాతి రోజు ఆలయంలోని నవగ్రహ మూర్తులు, త్రిశూలం విరిగిపోయిన స్థితిలో కనిపించాయి. ఈ ఘటనకు పాల్పడిన వారిని ఇంకా గుర్తించలేదు. అదే రోజు కోయంబత్తూరులోని భారతి పార్క్‌లోని శ్రీకృష్ణుడి మూర్తిని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఉద్యానవనాన్ని కోయంబత్తూర్‌ కార్పొరేషన్‌ నిర్వహిస్తుంది.

‘నాస్తిక’ డిఎంకె అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెరియారిస్ట్‌, ఇస్లామిస్ట్‌, మత ప్రచారకుల సంస్థలు పైచేయి సాధించడంతో, ఆలయ విధ్వంసాలు, దాడులు పెరుగుతున్నాయి. డిసెంబర్‌లో కూడా తిరుప్పూర్‌, పళని, విల్లుపురంలో వారం వ్యవధిలో మూడు ఆలయాలు ధ్వంసమయ్యాయి.

Source: Hindupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి