
596views
-
మొదటి యువతిగా రికార్డు
న్యూఢిల్లీ: అంటార్కిటికాలో ఒంటరి యాత్రను పూర్తి చేసిన మొదటి మహిళగా భారత సంతతికి చెందిన సిక్కు యువతి ప్రీత్ చందీ చరిత్ర సృష్టించారు. ఆమె 40 రోజుల్లో 700 మైళ్లు ప్రయాణించారు. భారతీయ సంతతికి చెందిన ఒక బ్రిటీష్ ఆర్మీ అధికారి ప్రీత్ చందీ 90 కిలోలు స్లెడ్, కిట్, ఇంధనం, ఆహారాన్ని మోసుకెళ్లారు.
“అంటార్కిటికా భూమిపై అత్యంత శీతలమైన, ఎత్తైన, పొడిగా, గాలులతో కూడిన ఖండం. అక్కడ ఎవరూ శాశ్వతంగా నివసించరు. నేను మొదట ప్లాన్ చేయడం ప్రారంభించినప్పుడు ఆ ఖండం గురించి నాకు పెద్దగా తెలియదు. అదే నన్ను అక్కడికి వెళ్లడానికి ప్రేరేపించింది” అని చాందీ చెప్పారు.





