
487views
-
ట్విట్టర్ వేదికగా ఎస్‌బిఐ ప్రకటన
న్యూఢిల్లీ: దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు తీపికబురు అందించింది. అన్నదాతలకు సులభంగానే రుణాలు అందిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా అతితక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది. ఈ మేరకు ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారానే ఈ తరహా రుణాలు పొందొచ్చని పేర్కొంది. అంటే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లోనే లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లోన్ అప్రూవల్ వచ్చిన తర్వాత బ్యాంక్‌కు వెళ్లి బంగారు ఆభరణాలు అందించాల్సి ఉంటుంది.





