
393views
-
పతనమవుతున్న ఉష్ణోగ్రతలు
విజయవాడ: ఉత్తర, తూర్పు గాలులు.. కోస్తా, రాయలసీమ ప్రాంత ప్రజల్ని వణికించేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. బుధవారం అత్యల్పంగా విజయనగరంలో 8.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
గుంటూరు, కృష్ణా, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోనూ చలి ప్రభావం అధికంగానే ఉంది. బుధవారం గుంటూరు జిల్లా జంగమహేశ్వపురంలో 11 డిగ్రీలు, కళింగపట్నం, ఆమదాలవలస 11.8, బాపట్ల 12.3, అనంతపురం 13, అమరావతిలో 13.3, విజయవాడలో 14.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచే చలిగాలులు మొదలవుతున్నాయి. ఉదయం 10 గంటలైనా కొన్ని చోట్ల చలి తీవ్రత తగ్గడం లేదు.





