
-
పాక్ నుంచి అక్రమ రవాణా
-
రూ. 400 కోట్లు విలువ ఉంటుందని అంచనా
గాంధీనగర్: గుజరాత్ తీరంలో భారీగా మత్తుపదార్ధాలు పట్టుబడ్డాయి. పాకిస్థాన్ నుంచి భారత సముద్ర జలాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్‌ను సముద్ర తీర రక్షక దళం పట్టుకుంది. గుజరాత్ తీరం ప్రాంతంలో కోస్ట్ గార్డ్, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో పాకిస్తాన్‌కు చెందిన బోటుని సీజ్ చేశారు. పాకిస్తాన్ బోటులో ఉన్న 77 కిలోల భారీ స్థాయిలో ఉన్న హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదే విషయంపై గుజరాత్ ఏటీఎస్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ పాకిస్తాన్ బోట్ ‘అల్ హుసేనీ’ భారత జలాల్లోకి ప్రవేశిస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు. భారీగా హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలు దొరికాయని, విలువ రూ. 400 కోట్లు ఉంటుందని చెప్పారు. అంతేకాదు బోటులోని ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నట్టు పేర్కొన్నారు. పడవను సీజ్ చేసి జాఖౌకు తరలించారు. మనకు 1,600 కి.మీ-పొడవు తీరప్రాంతం ఉంది.. అందువల్ల అన్ని ఏజెన్సీలు సమన్వయంతో డ్రగ్ రవాణా అడ్డుకోవడానికి పని చేస్తాయని శుక్లా చెప్పారు.
Source: Tv9





