News

భారత సాంస్కృతిక వికాసానికి ప్రధాని పెద్ద పీట

658views
  • పూర్వ వైభవం సంతరించుకోనున్న కాశీ నగరం

  • ఈ నెల 13న మోదీ పర్యటన

కాశీ: ప్రధానమంత్రి మోదీకి ఆధ్యాత్మిక నగరమైన కాశీతో లోతైన అనుబంధం ఉంది. ఆయన ప్రధాని కాకముందు బాబా విశ్వనాథ్‌ను దర్శించుకోవడానికి చాలాసార్లు వచ్చారు. ప్రధాని అయిన తర్వాత కూడా కాశీని సందర్శించారు. కాశీ నగరం ఆధ్యాత్మికతను మరింత పెంపొందించడానికి, కాశీ కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి మోదీ నడుం బిగించారు. విశ్వనాథ్‌ మందిరాన్ని అత్యన్నతంగా తీర్చిదిద్దడం ప్రధాని మోదీ జీవితకాల కలగా ఉంది. ఆ దిశగా కాశీ అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారు.

అందులో భాగంగా ఈనెల 13న వారణాసిలో పర్యటించనున్నారు. కాశీ-విశ్వనాథ్‌ కారిడార్‌ను ప్రారంభించనున్నారు. సంస్కృతి, వారసత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని కాశీని అభివృద్ధి చేస్తున్నారు. కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ కాశీ విశ్వనాథ దేవాలయం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మారుస్తుంది. 20-25 అడుగుల వెడల్పు గల కారిడార్‌ గంగా నదిపై లలితా ఘాట్‌ను ఆలయ ప్రాంగణంలోని మందిర్‌ చౌక్‌కు కలుపుతుంది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోదీ ఆలయ సముదాయాన్ని సుందరీకరించడానికి అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇటీవల ప్రధాని మోదీ సోమనాథ్‌ ఆలయ సముదాయంలో సముద్రతీర ప్రొమెనేడ్‌, ఎగ్జిబిషన్‌ సెంటర్‌ను ప్రారంభించారు. 2013 వరదల్లో విస్తృతంగా విధ్వంసానికి గురైన కేదార్‌నాథ్‌ ధామ్‌ను మోదీ ప్రభుత్వం తిరిగి అభివృద్ధి చేసింది. ఇటీవలే కేదార్‌నాథ్‌ ఆలయ ప్రాంగణాన్ని మోదీ ప్రారంభించారు. దూరదృష్టితో ఆధునిక భారతదేశంలో ఆధ్యాత్మకతకు పునాది వేస్తున్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి