
527views
న్యూఢిల్లీ: వాట్సాప్ 20 లక్షల భారతీయుల ఖాతాలపై నిషేధం విధించింది. వీటిపై సంస్థకు 500 ఫిర్యాదులు అందినట్టు తెలిపింది. వేధింపులను అరికట్టడం సహా యూజర్ల భద్రత కోసం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు వివరించింది. 95 శాతానికి పైగా ఖాతాలను బల్క్ మెసేజింగ్‌ను దుర్వినియోగం చేసినందువల్లే బ్యాన్ చేసినట్టు వాట్సాప్ తెలిపింది. ఈ వేదికపై వేధింపులను అరికట్టేందుకు నెలవారీగా సుమారు 80 లక్షల ఖాతాలను నిషేధిస్తోంది వాట్సాప్. సెప్టెంబర్‌లోనూ 560 ఫిర్యాదు నివేదికలు అందగా, 22 లక్షల భారతీయుల ఖాతాలను నిలిపేసింది.





