News

7 లక్షల ఏకే 203 తుపాకుల కొనుగోలుకు రష్యాతో ఒప్పందానికి భారత్ కసరత్తు

386views

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య 7.5 లక్షల ఏకే 203 రైఫిళ్ల కొనుగోలు ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. దీంతో భారత్-రష్యా సైనిక సంబంధాలు బలోపేతమవనున్నాయి. ఈ ఒప్పందంపై కేంద్ర కేబినెట్ నుంచి ఇప్పటికే అన్ని రకాల అనుమతులూ లభించాయి. కాగా, డిసెంబర్ 6న పుతిన్ భారత్ చేరుకోనున్నారు. ప్రధాని మోదీ-పుతిన్ భేటీలో భాగంగా ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్​ వ్యవస్థను కూడా భారత్​కు అందించే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి