News

వరద బాధితులకు ఆహార పొట్లాల పంపిణీ

665views

తిరుపతి: ఇక్కడి సేవా భారతి కార్యకర్తలు న్యూ ఇంద్రానగర్‌లోని వరద బాధితులకు ఆహార పొట్లాలు, మంచినీళ్లు, బ్రెడ్‌, బిస్కెట్స్‌, పాల ప్యాకెట్లు సుమారు మూడు వందల కుటుంబాలకు పంపించారు. అలాగే ఆర్‌.ఎస్‌.ఎస్‌ తిరుపతి జిల్లా కార్యకర్తలు కొండకోనల్లో ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్ళి, 300 మందికి మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పించారు. స్థానికంగా ఉన్న చిటత్తూరు, కాలేపల్లి రాయల చెరువు గ్రామస్తులు మూడు వందల మందికి భోజన సదుపాయం కల్పించారు. అలాగే, రాత్రి మూడు గ్రామాల్లోని 600 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమాల్లో 22 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు. గుండోడి కనంలోని కొండ ప్రాంతాల వారికి కూడా భోజన సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా తిరుపతి విభాగ్‌ సేవా ప్రముఖ్‌ కొండా రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవ ధర్మమన్నారు. తుపాను బాధితులకు ప్రతీ ఒక్కరూ తమకు తోచిన సాయాన్ని అందించి ఆదుకోవాలని కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి