
-
లాక్ డౌన్ ఆంక్షలు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు
-
పలుచోట్ల హింసాత్మక ఘటనలు
బెల్జిజం: యూరోపియన్ దేశాల్లో కరోనా కేసులు.. అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో ఆయా దేశాలు ఆంక్షలు విధిస్తుండటంతో ప్రజలు ఆగ్రహావేశాలు తెలుపుతున్నారు. ఆంక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బెల్జిజంలో వేల సంఖ్యలో ప్రజలు రోడ్డెక్కారు. రాజధాని బ్రసెల్స్‌లో ఆదివారం ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ‘ఫ్రీడం.. ఫ్రీడం’ అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. దీంతో ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. కార్లను ధ్వంసం చేసి.. అక్కడున్న చెత్తకుండీలకు నిప్పంటిచారు. ఈ క్రమంలో పలువురు పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులను కట్టడి చేసేందుకు అధికారులు బాష్పవాయువు, జల ఫిరంగులను ప్రయోగించారు. నెదర్లాండ్స్‌లోనూ ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. స్థానిక యువత వాహనాలకు నిప్పు పెట్టారు. ఇప్పటివరకు 51 మందిని అధికారులు అరెస్ట్ చేశారు.





