
587views
-
అమిత్ షా నేతృత్వం
న్యూఢిల్లీ: టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో హైపవర్ పోలీస్ టెక్నాలజీ మిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో జరిగిన 56వ డీజీపీ, ఐజీపీ సభ ముగింపు సందర్భంగా మోదీ ప్రసంగించారు. పోలీస్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు కొన్ని సంఘటనలను విశ్లేషించి కేస్ స్టడీలను రూపొందించాలని కోరారు.
కొవిన్, జెమ్ పోర్టల్, యూపీఐ పేమెంట్స్ దేశంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు బలగాలకు ప్రయోజనం చేకూర్చే ఇంటర్-ఒపేరబుల్ టెక్నాలజీలను అభివృద్ధి చేయాలని సూచించారు. కరోనా తరువాత పోలీసుల వైఖరిలో సానుకూల మార్పును ప్రశంసించారు. ప్రజల ప్రయోజనం కోసం డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించాలని.. స్మార్ట్ పోలీసింగ్ కాన్సెప్ట్‌ను సమీక్షించాలని కోరారు.





