News

4 రోజుల పర్యటనకు విశాఖ చేరుకున్న ఉప రాష్ట్రపతి

614views

విశాఖ‌ప‌ట్నం: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్​లో జిల్లా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ పోర్ట్ అతిథి గృహంలో బస చేశారు. నేడు అరకు వెళ్లే పర్యాటకుల కోసం విశాఖ నుంచి అరకుకు విస్టా డోమ్ కోచ్​లతో ప్రత్యేక రైలును వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. ఈ రైలు సింహాచలం, కొత్తవలస, ఎస్.కోట, బొర్రా స్టేషన్​లలో ఆగనుంది. తిరిగి అరకు నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.45 గంటలకు విశాఖ చేరుతుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.