News

శబరిమల యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

768views
  • భారీ వర్షాల ఫలితం

తిరువనంతపురం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శబరిమల యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలతో పంబా నది సహా ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరుగడంతో ఈ రోజు ఒక్కరోజు శబరిమల స్వామి దర్శనాలను నిలపివేస్తున్నట్టు పథనంతిట్టా కలెక్టర్‌ దివ్య ఎస్‌.అయ్యర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

వర్చువల్‌ క్యూ సిస్టమ్‌ ద్వారా స్లాట్‌ను బుక్‌ చేసుకున్న భక్తులకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత సమీప స్లాట్‌లో దర్శన అవకాశం కల్పిస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. యాత్రికులు అధికారులతో సహకరించాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి