News

ప్రభుత్వానికి, ప్రజలకు గవర్నర్‌ ‘మార్గదర్శి, స్నేహితుడు’

619views
  • రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి, ప్రజలకు గవర్నర్‌ ”మార్గదర్శి, స్నేహితుడు, తత్వవేత్త” అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. గవర్నర్లు రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని, ప్రజలతో సజీవ సంబంధాలు ఏర్పరచుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, సేవ కోసం కట్టుబడి ఉన్నామని గవర్నర్లు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.

రాష్ట్రపతి భవన్‌లో గురువారం నిర్వహించిన 51వ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవరుర్ల సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ ప్రజల్లో చైతన్యం పెంపొందించడంతోపాటు జాతీయ లక్ష్యాలను చేరుకోవడంలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చేయడంలో గవర్నర్ల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో సాధారణ ప్రజలతో ”నిరంతర సంబంధాలు” కొనసాగించాలని కోవింద్‌ తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి