
-
అంతర్జాతీయ సదస్సులో పేర్కొన్న మోడీ
గ్లాస్గో: 2070 నాటికి కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్ మారుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు కట్టడి చేసేందుకు పారిస్ ఒప్పందంలోని తీర్మానాలకు అనుగుణంగా కార్యచరణ చేపట్టిన ఏకైక దేశం భారత్ అని చెప్పారు. వాతావరణ మార్పుల కట్టడి కోసం భారత్ ఎంతో శ్రమిస్తోందని దాని ఫలితాలు త్వరలోనే వస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు గ్లాస్గో వేదికగా జరిగిన కాప్26 ‘ప్రపంచ నేతల సదస్సు’లో ఆయన మాట్లాడారు. భారత్ తన విధానాలలో వాతావరణ మార్పులను కేంద్ర స్థానంలో ఉంచుతోందని మోదీ తెలిపారు. రాబోయే తరానికి ఈ సమస్యలపై అవగాహన కల్పించేందుకు పాఠశాల సిలబస్లో వాతావరణ అనుకూల విధానాలను చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాతావరణ మార్పుల కోసం ఐదు లక్ష్యాలను భారత్ నిర్దేశించుకుందని మోదీ ఈ సదస్సులో తెలిపారు. తద్వారా వాతావరణ మార్పుల కట్టడిలో భారత్ అద్భుత ఫలితాలు సాధిస్తుందని చెప్పారు.





